సిద్దిపేట, వెలుగు: నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను ఇస్తోందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, ఓవర్‌హెడ్ ట్యాంకును మంత్రి ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 500 మందికి ఇండ్లు ఇచ్చామని, ఎస్సీలు, సంచారజాతుల వారికి ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇర్కోడ్ గ్రామస్తులు నియంత్రిత పంటల సాగుకు మద్దతు ప్రకటించి, చెప్పిన పంటలు వేయడం అభినందనీయమన్నారు. రూ.3 కోట్ల ఖర్చుతో కట్టనున్న ప్రభుత్వ ఐటీఐ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇర్కోడ్, రావు రూకుల, ఎన్సాన్‌పల్లి గ్రామాల్లోని చెరువులో చేపలు వదిలారు. రావురూకుల గ్రామంలో డంప్‌యార్డు, ఫంక్షన్ హాల్, సైడ్ డ్రైన్, రాఘవపూర్‌లో సైడ్ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, డీఆర్డీవో గోపాల్ రావు, డీపీవో సురేశ్ పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ మీటింగ్‌లో పాల్గొన్న మంత్రి..
సిద్దిపేట అర్బన్‌మండలం మిట్టపల్లి గ్రామ పంచాయతీ పాలక వర్గ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓ మంత్రి గ్రామపంచాయతీ సమావేశానికి హాజరు కావడం ఇదే తొలిసారి. మంత్రి సమక్షంలో పాలకవర్గం పలు తీర్మానాలను ఆమోదించింది. అనంతరం గ్రామంలో నిర్మించిన సమీకృత మార్కెట్, వడ్డెర కమ్యూనిటీ హాల్, లైబ్రరీ, వర్మీ కంపోస్ట్‌తయారీ కేంద్రం, సామూహిక గొర్రెల వసతి సముదాయాలను మంత్రి ప్రారంభించారు.
రైల్వే లైన్ పనులపై సమీక్ష..
ఉమ్మడి మెదక్‌జిల్లాలోని రైల్వే లైన్‌పనులపై మంత్రి హరీశ్‌రావు శనివారం హైదరాబాద్‌లో ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. పనుల ప్రగతిని సమీక్షించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాల వల్లసిద్దిపేట, మెదక్‌జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్ల రిపేర్ కోసం ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
For More News..