ఇండ్లను పంపిణీ చేయకముందే ఆక్రమించుకున్న నిరుపేదలు

హనుమకొండ జిల్లా: కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలు ఆక్రమించుకున్నారు.  ప్రభుత్వం పంపిణీ చేయకముందే నిరుపేదలు ఇండ్లలోకి చేరారు. తట్టా.. బుట్టా తెచ్చుకుని ఇళ్లలోకి చేరిపోయారు.వామపక్షాల ఆధ్వర్యంలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల ముట్టడికి పిలుపునివ్వడంతో ఇవాళ ఉదయమే ఇండ్ల దగ్గరకు వచ్చిన నిరుపేదలు.. ఇళ్లు ఆక్రమించుకున్నారు.

విషయం తెలుసుకున్నయపోలీసులు ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా వాగ్వాదానికి దిగారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలికంగా ఆక్రమించుకున్నా ఉపయోగం ఉండదని డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు సర్దిచెప్పారు.