కరీంనగర్ సిటీ, వెలుగు: పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ లీడర్లు, కార్యకర్తలు కరీంనగర్ అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం రాస్తారోకో చేశారు. దీంతో హైదరాబాద్, వరంగల్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అదే టైంలో అటువైపుగా వెళ్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కాన్వాయ్ ను అడ్డుకున్నారు. పోలీసులు చేరుకుని వెంటనే బీజేపీ లీడర్లు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ లీడర్లు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలను, ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిల్లపు రమేశ్, రాజేంద్రప్రసాద్, ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి, దరువు ఎల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి , ఉపాధ్యక్షులు మాడా వెంకటరెడ్డి , గుర్రాల వెంకటరెడ్డి , మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు, కరీంనగర్ మానకొండూరు అసెంబ్లీ కన్వీనర్లు దుబాల శ్రీనివాస్ , ముత్యాల జగన్ రెడ్డి , జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కల్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.