జనవరిలో ఇల్లులేని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం:మంత్రి పొంగులేటి

తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది.. ఈ రాజ్యంలో మేమంతా సేవకులుగా పనిచేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి పొంగులేని మాట్లాడుతూ.. 2024 జనవరిలో ఇల్లు లేని ప్రతి పేదకు డబుల్ బెడ్ రూం ఇండ్లకట్టిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే  సీఎం ప్రమాణం స్వీకారం చేయగానే ఆరు గ్యారెంటీల పథకానికి చట్ట బద్దత కల్పించేందుకు పటిష్టమైన ఆలోచన చేశామన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 

నాకు ముఖ్యమైన శాఖలను సీఎం రేవంత్ రెడ్డి అప్పగించారు.. మా శక్తి మొత్తం రాష్ట్రాభివృద్ధి కోసమే వాడతామన్నారు మంత్రి పొంగులేటి. అవినీతి చేసిన కేసీఆర్  కుటుంబాన్ని అరెస్ట్ తధ్యమని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.