ఒక్కరికీ కూడా ఇల్లు ఇయ్యలే..​పన్నాల తిరుపతి రెడ్డి

బీజేపీ లీడర్ ​పన్నాల తిరుపతిరెడ్డి

 జగిత్యాల టౌన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూం ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి, ఒక్కరికి కూడా ఇవ్వలేదని బీజేపీ లీడర్​పన్నాల తిరుపతి రెడ్డి ఆరోపించారు. మంగళవారం జగిత్యాల జిల్లా నూకపెల్లీ గ్రామంలో నిర్మించిన ఇండ్లను బీజేపీ లీడర్లు పరిశీలించారు. 

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల అభ్యర్థులను ఎంపిక చేసి మూడు నెలలు కావస్తున్నా ఒక్కరికి కూడా ఇల్లు కేటాయించలేదన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అనిల్, రాజేందర్, అజయ్, శ్రీనివాస్,  మల్లేశం రాజన్న పాల్గొన్నారు.