కుత్బుల్లాపూర్ దేవేందర్ నగర్ లోని డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అర్హులైన పేదలకు ఇండ్లు కేటాయించాలని ఏప్రిల్ 28వ తేదీ శుక్రవారం ఉదయం బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నిరసన దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించి కాపలా కాస్తున్నారు.
అయితే శాంతి యుతంగా నిరసన తెలిపేందుకు వస్తున్న బీజేపీ కార్యకర్తలను, డబుల్ బెడ్రూంల వద్దకు రానియ్యకుండా అడ్డుకున్నారు పోలీసులు. నిరసన తెలిపేందుకు వచ్చినవారిని అరెస్టు చేసి జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ కు తరలించారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టి హౌస్ అరెస్టు చేశారు.