
గజ్వేల్: తమకు కేటాయించిన డబుల్ బెడ్ రూంలు ఇవ్వాలని లబ్ధిదారులు ఆందోళన చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో తమకు ఇండ్ల పొసిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... అంబేద్కర్ విగ్రహం వద్ద డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కీ డ్రా తీసి 8 నెలలు గడిచిని ఇప్పటివరకు ఇండ్లు కేటాయించలేదన్నారు.
గత ప్రభత్వం గజ్వేల్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు1100 మంది లబ్ధిదారులను డ్రా ద్వారా గుర్తించిందన్నారు. ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇండ్లు కేటాయించాలని కోరారు.