కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలంటూ కొట్టిపారేశారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎలక్షన్ మద్యలో డ్రాప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. అందుకే కేసీఆర్ భయపడి ఇలాంటి అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వాన్ని పడగొడుతామంటే చూస్తూ ఊరుకోమన్నారు షబ్బీర్ అలీ. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి తో టచ్ లో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ కు జైల్ లోనే డబుల్ రూమ్ కట్టామని.. కుటుంబ సభ్యులందరిని ఒకే జైలులో ఉంచుతామని హెచ్చరించారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎక్కడా కూడా నష్టపరిహారం ఇవ్వలేదన్నారు షబ్బీర్ అలీ .. ఎన్నికల తర్వాత తామిస్తామని హామీ ఇచ్చారు.