తల తాకట్టుపెట్టయినా డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తా

తల తాకట్టుపెట్టయినా డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తా

తల తాకట్టుపెట్టయినా.. ప్రతి లబ్దిదారునికి డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తానని హామీ ఇచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం..బన్సీలాల్ పేట్ డివిజన్ బండ మైసమ్మ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ రూమ్స్ ఇండ్లను మంత్రి తలసాని..స్థానిక నాయకులు, అధికారులతో పాటు కలిసి పరిశీలించారు. వచ్చే దసరా వరకు పూర్తి చేసి దీపావళి రోజున 336 డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు.

ఒకప్పుడు ఈ బస్తీకి పిల్లను ఇవ్వాలన్నా..తెచ్చుకోవాలన్నా ఎవరు ఇవ్వకుండా ఉండేవారని..అలాంటి బస్తీని ఈ రోజు డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లుగా మారిస్తే వాటి వాల్యూ ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెసులుసన్నారు తలసాని. ఈ బస్తీని కాలి చేసిన తర్వాత కూడా చాలమంది చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా భయపడకుండా ఎదుర్కొని నిర్మిస్తున్నామన్నారు. ఇంకా ఒక్కరిద్దరు కోర్టు నుండి స్టెతస్కో తెచ్చుకొని ఇబ్బంది పెడుతున్న వారిని వెంటనే ఒప్పించి కాలి చేయించాలని రెవిన్యూ..మున్సిపల్ అధికారులను ఆదేశించారని తెలిపారు మంత్రి తలసాని.