ఈ వీకెండ్ క్రికెట్ అభిమానులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. అందుకు కారణం ఆదివారం(అక్టోబర్ 6) ఒక్కరోజే రెండు టీమిండియా మ్యాచ్‌లు ఉండటం. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్- పాక్ మహిళా జట్లు తలపడనుండగా, టీ20 సిరీస్ నేపథ్యంలో భారత్- బంగ్లాదేశ్ పురుషుల జట్లు పోటీపడనున్నాయి.
అక్టోబర్ 06 నుంచి భారత్- బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20కు గ్వాలియర్ ఆతిథ్యమివ్వనుండగా, రెండో టీ20కు ఢిల్లీ, మూడో టీ20కి హైదరాబాద్ వేదికలుగా ఉన్నాయి. చివరి సారి ఈ ఇరు జట్లు 2024 టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 50 పరుగులు తేడాతో బంగ్లాను మట్టికరిపించింది. టెస్ట్ సిరీస్‌లో ఓడిన బంగ్లా అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. దాంతో, హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.
ALSO READ | IND vs BAN: నేటి(అక్టోబర్ 05) నుంచి ఉప్పల్ టీ20 టికెట్ల సేల్
లైవ్ స్ట్రీమింగ్: భారత్ - బంగ్లాదేశ్ టీ20 సిరీస్ టీవీలో సోర్ట్స్ 18 ఛానెల్‌తో పాటు జీటీవీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా యాప్‌లో, జియో వెబ్సైట్లో లైవ్ ఆస్వాదించవచ్చు.
ఇండియా vs న్యూజిలాండ్
భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత మహిళా టీ20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్‌లోనే పరాజయం పాలయ్యింది. శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తదుపరి అక్టోబర్ 06న ఆదివారం పాకిస్థాన్ జట్టుతో హర్మన్ సేన తలపడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ పోరులో టీమిండియా విజయం సాధిస్తే తప్ప టోర్నీలో ముందుకెళ్లే పరిస్థితులు లేవు.
లైవ్ స్ట్రీమింగ్: భారత్ - పాక్ ఆసక్తికర పోరు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో టెలికాస్ట్ అవుతుంది. డిస్నీహాట్ స్టార్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ ఆస్వాదించవచ్చు.