Double iSmart: శివరాత్రికి రిలీజ్ అన్నారుగా..డబుల్ ఇస్మార్ట్కి ఏమైంది పూరి?

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్(Puri Jagannadh) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double Ismart). రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అత్యున్నత ప్రమాణాలతో రాబోతున్నట్టు సమాచారం.

మహా శివరాత్రి(మార్చి 8న) సందర్భంగా మూవీని రిలీజ్ చేయనున్నట్లు గతేడాది మేకర్స్ వెల్లడించారు.అప్పట్లో 100 రోజుల కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అంటూ చెప్పుకొచ్చారు.కానీ, టెక్నీకల్ ఇస్యూ వల్ల ఆగిపోయిందని టాక్ వినిపించింది. అయినా ఇప్పటికీ డబుల్ ఇస్మార్ట్ నుంచి కాస్తయినా సౌండ్ మాత్రం వినిపించట్లేదు. దీంతో ఈ సినిమా ఏమైంది? మధ్యలోనే ఆగిపోయిందా ఏంటీ? అంటూ కామెంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి.

ALSO READ :- పరువు పోగొట్టుకున్నారు: హండ్రెడ్ లీగ్‌లో పాక్ స్టార్ ఆటగాళ్లకు ఘోర అవమానం

రీసెంట్ గా ఓ ఈవెంట్ కి వచ్చిన రామ్ జూన్ లో డబుల్ ఇస్మార్ట్  రిలీజ్ అని చెప్పారు.దీంతో డబుల్ డోస్ ఆగిపోలేదని క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లేలా చేయడానికి మ్యూజిక్ వర్క్ లో మణిశర్మ మస్తు బిజీగా ఉన్నారట. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ లో మణిశర్మ మ్యూజిక్ కీ రోల్ పోషించింది.

అయితే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా లెవల్లో రానుంది కాబట్టి ఆ రేంజ్ కు తగ్గట్టుగా కొత్త మ్యూజిక్ వినిపించడానికి మణిశర్మ గట్టి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో డబుల్ ఇస్మార్ట్ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి కానుందట. చకచకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేయనున్నారట మేకర్స్. ఎట్టి పరిస్థితిలో జూన్ లో రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.

పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంపై పాన్ ఇండియా వైడ్‌‌‌‌గా భారీ అంచనాలున్నాయి. త్వరలో డైరెక్టర్ పూరి ఫైనల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది.మరి పూరి-రామ్ పోతినేని కలిసి మరోసారి మాస్ హిస్టీరియా రిపీట్ చేస్తారేమో చూడాలి.