‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత హీరో రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ముంబైలో జరిగిన ఈ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్‌లో రామ్‌తో పాటు సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు.
తాజాగా సెకండ్ షెడ్యూల్‌ను థాయ్‌లాండ్‌లో మొదలుపెట్టారు. ప్రస్తుతం అక్కడ శరవేగంగా షూటింగ్ జరుగుతోందని తెలియజేస్తూ.. టీమ్ అంతా కలిసున్న ఫొటోను షేర్ చేశారు పూరి జగన్నాథ్. ఇందులో రామ్, సంజయ్ దత్‌లతో పాటు పూరి జగన్, ఛార్మి సహా టీమ్ అంతా ఉన్నారు.
ఈ చిత్రంలో రామ్ స్టైలిష్ గెటప్‌లో కనిపించనున్నాడు. పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్యాన్ ఇండియా వైడ్‌గా సినిమా విడుదల కానుంది.