ఇస్మార్టు శంకరే.. ఏక్‌‌‌‌దమ్ డేంజర్ 

ఇస్మార్టు శంకరే..  ఏక్‌‌‌‌దమ్ డేంజర్ 

‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్.. మేడ్ ఇన్ ఓల్డ్ సిటీ’ అంటున్నాడు రామ్.  తను హీరోగా   పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్రం నుంచి తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను పరిచయం చేస్తూ.. సోమవారం ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ ఫాస్ట్ బీట్‌‌‌‌ సాంగ్‌‌‌‌కు భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ రాశారు. అనురాగ్ కులకర్ణి, సాహితీ పాడిన విధానం ఆకట్టుకుంది. ‘ఖిరి ఖిరి ఖిరి ఖిరి.. దిమ్మాక్ ఖిరీ ఖిరీ.. ఇస్మార్టు శంకరే.. ఏక్‌‌‌‌దమ్ డేంజరే.. నిప్పెట్టిన పటాకే.. డబుల్ దిమాకే.. శంభో హర శంకర..జాతర జాతర.. గల్లీ గల్లీ పోరా లొల్లి..డీజే డబుల్ ఇస్మార్ట్.. స్టెప్పా మార్ స్టెప్పా మార్..’ అంటూ సాగిన పాటలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌‌‌‌తో రామ్ ఇంప్రెస్ చేశాడు. పాత బస్తీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో సాగిన పాటలో పక్కా మాస్‌‌‌‌ లుక్‌‌‌‌లో ఆకట్టుకున్నాడు.   జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట సినిమాకు హైలైట్‌‌‌‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  సంజయ్ దత్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్‌‌‌‌. అలీ, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.