5,600 మందికి డబుల్ పెన్షన్లు

5,600 మందికి డబుల్ పెన్షన్లు
  • గత సర్కారు నిర్లక్ష్యంతో రూ.46 కోట్లు నష్టం
  • సెర్ప్​ అధికారుల స్టడీలో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో  రాష్ర్ట వ్యాప్తంగా 5600 మంది డబుల్ పెన్షన్ తీసుకున్నట్లు సెర్ప్​అధికారులు నిర్వహించిన స్టడీ వెల్లడించింది. దీని వల్ల ప్రభుత్వానికి రూ.46 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు. డబుల్ పెన్షన్ తీసుకుంటున్న వారిని గుర్తించి వారికి ఆసరా పెన్షన్ ఆపేసినట్లు చెప్పారు. వారికి నోటీసులు ఇచ్చి డబ్బు రికవరీ చేసే అంశంపై ప్రభుత్వానికి లేఖ రాశామని వెల్లడించారు. 

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చర్యలు చేపడతామన్నారు. అలాగే..ప్రభుత్వం దగ్గర ప్రస్తుతం ఆసరా పెన్షన్ల కోసం 55 వేల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పారు.  వీటిని త్వరలో పరిశీలించి, అర్హుల లిస్టును ప్రభుత్వానికి అందచేస్తామన్నారు.  కొత్త ఆసరా అప్లికేషన్ కోసం అప్లికేషన్ల స్వీకరణను 2022లో ఆపేసినట్లు అధికారులు పేర్కొన్నారు.