పగోడికి కూడా రావొద్దు ఈ కష్టం : వరదల్లో కుటుంబం మొత్తం..ఇప్పుడు కాబోయే భర్త మరణం..

పగోడికి కూడా రావొద్దు ఈ కష్టం : వరదల్లో కుటుంబం మొత్తం..ఇప్పుడు కాబోయే భర్త మరణం..

విధి రాతను ఎవ్వరూ తప్పించలేరు అనటానికి ఈ ఘటన ఓ ఎగ్జాంపుల్ అయితే.. ఇలాంటి కష్టం పగోడికి కూడా రావొద్దు అంటున్నారు అక్కడి జనం.. మన కేరళ రాష్ట్రంలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందర్నీ కన్నీళ్లు తెప్పిస్తుంది. మొన్నటి వయనాడ్ వరదల్లో తల్లిదండ్రులతో సహా మొత్తం 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయింది శృతి. అలాంటి సమయంలో అండగా నిలబడిన కాబోయే భర్త సైతం ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవటం కేరళ రాష్ట్రంలో అందరినీ కలిచివేస్తుంది. ఆ విషాధ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

కోజికోడ్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న శ్రుతి.. జూలై 30న మెప్పాడి పంచాయతీలోని చూరల్‌మల, ముండక్కై గ్రామాలలో కొండచరియలు విరిగిపడటంతో ఆమె తల్లిదండ్రులు, చెల్లెలు సహా తొమ్మిది మందిని కోల్పోయింది. కుటుం బం మొత్తం మరణించడంతో విషాదం నెలకొంది. ఇలాంటి విషాద సమయంలో ఆమెకు తోడుగా నిలిచిన వ్యక్తి జెన్సన్.. జెన్సన్, శృతి పదేళ్లుగా ప్రేమించు కుంటు న్నారు.జూన్ 2న నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కుటుంబం మొత్తం కోల్పోయిన శృతికి జెన్సన్ అండగా ఉన్నాడు అనుకునే సమయంలో మరో ప్రమాదం వారిని విడదీసింది.

Also Read :- దేవర సినిమా చూసి చచ్చిపోతా..దయచేసి నన్ను బతికించండి

సెప్టెంబర్ 10న జెన్సన్ తన కారును ప్రైవేట్ బస్సును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. 2024, సెప్టెంబర్ 12న డాక్టర్ మూపెన్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న జెన్సన్ మృతిచెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న శృతితోపాటు మరికొంతమంది కుటుంబసభ్యులు తీవ్రంగా పడ్డారు. 

మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంటలో ఒకరు మృతి చెందడం..ఇంకొకరు తీవ్రంగా గాయపడటంతో విషయం తెలిసిన వారంతా అయ్యో.. విధిరాతను ఎవ రు మార్చలేరు కదా.. శృతికి వచ్చిన కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని సానుభూతి చూపుతున్నారు.