
బషీర్‌బాగ్, వెలుగు: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయని.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీబీఐతో విచారణ జరిపించాలని క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు డిమాండ్ చేశారు. హైదర్ గూడ లోని న్యూస్ సెంటర్ లో క్రిస్టియన్ యునైటెడ్ యూత్ ఫోరమ్ ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు.
క్రైస్తవ సంఘాల ప్రతినిధులు బిషప్ భాస్కర్, సుజీవన్ డిను, అశోక్, దర్శన్, సుధీర్ పాల్గొని మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ కు మృతికి ముందు బెదిరింపు కాల్స్ వచ్చాయని, పోలీసులు కేసును తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. మతాలకు సంబంధించిన విషయాలపై చానల్స్ డిబేట్స్ పెట్టవద్దని కోరారు. సోషల్ మీడియాలో డిబేట్స్ కారణంగానే ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రవీణ్మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఖైరతాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని, దీనిపై న్యాయ విచారణ జరపాలని ఫుడ్స్మాజీ చైర్మన్ఎమ్.రాజీవ్ సాగర్, ప్రొఫెసర్గాలి వినోద్కుమార్డిమాండ్ చేశారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. ఏపీ రాజమండ్రి సమీపంలో పాస్టర్ప్రవీణ్ పగడాల, హైదరాబాద్‌లో న్యాయవాది ఇజ్రాయిల్‌ను హత్య చేశారన్నారు. ఇటీవల కాలంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఈ దాడుల వెనుక ఎవరున్నా ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సాల్మాన్‌రాజు తదితరులు ఉన్నారు.