మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కన్సాలిడేట్ అవుతున్న ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కన్సాలిడేట్ అవుతున్న ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

ముంబై: బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వరుసగా మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ పడ్డాయి.  ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండగా, కొన్ని బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు కూడా నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కదలడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం నష్టపోయింది. సెన్సెక్స్ 159 పాయింట్లు (0.27 శాతం) పడి 59,568 వద్ద  క్లోజయ్యింది. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 17,619 వద్ద  ముగిసింది. వరసగా తొమ్మిది సెషన్ల పాటు పెరిగిన మార్కెట్, ప్రస్తుతం కన్సాలిడేషన్ స్టేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని ఎనలిస్టులు అంటున్నారు. ‘కంపెనీల క్యూ4 నెంబర్లు బలహీనంగా ఉండడంతో డొమెస్టిక్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వరుసగా మూడో సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ నష్టపోయాయి.

ఇతర టెక్ కంపెనీల  రిజల్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెలువడే ముందు  ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది’ అని జియోజిత్ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వినోద్ నాయర్ పేర్కొన్నారు.  ఫెడ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండడంతో  గ్లోబల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు డల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కదులుతున్నాయని అన్నారు. డల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్న మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొద్దిపాటి నష్టాలతో ముగిశాయని రెలిగేర్ బ్రోకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఎనలిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అజిత్ మిశ్రా పేర్కొన్నారు.  

బ్రాడ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చూస్తే, బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0.12 శాతం పెరగగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 0.18 శాతం పడింది.  టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యుటిలిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్యాపిటల్ గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా పడ్డాయి. మెటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎనర్జీ, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్టీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు లాభపడ్డాయి. జపాన్, షాంఘై,   హాంకాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నష్టాల్లో కదిలాయి.