చిన్నయ్యకు బీఫాం ఇచ్చినప్పుడే .. బీఆర్ఎస్ ​పతనం మొదలైంది : శేజల్

చిన్నయ్యకు బీఫాం ఇచ్చినప్పుడే .. బీఆర్ఎస్ ​పతనం మొదలైంది :  శేజల్

నస్పూర్, వెలుగు : మహిళలంటే గౌరవం లేని చిన్నయ్యకు బీఫాం ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పతనం మొదలైందని ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ అన్నారు. గురువారం ఆమె మంచిర్యాల జిల్లా నస్పూర్​లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ మహిళలను మానసికంగా, లైంగికంగా వేధించేవారిని ఎన్నికల బరిలో నిలపడం బాధాకర మన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించడానికి బెల్లంపల్లి వస్తే చిన్నయ్య గూండాలు తనపై దాడిచేశారని వాపోయారు.

పోలీసులు, అధికారులు కుమ్మకై రౌడీలను వదిలేసి, తన వల్ల శాంతి భద్రతల సమస్య వస్తుందని బైండోవర్ కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిన్నయ్య ఆగడాలను పల్లె పల్లెకు, గడప గడపకు వివరించాలని ఉన్నా..సరిపడా సమయం లేదని, చిన్నయ్య మనుషులతో ప్రాణహాని ఉందన్నారు. ఎన్నో రకాలుగా హింసించిన దుర్గం చిన్నయ్యను ఓడించాలని, ఎవరూ ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తనకు ధైర్యం చెప్పిన గడ్డం వినోద్ కు అండగా నిలవాలన్నారు. రేవంత్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, తీన్మార్ మల్లన్న వంటి లీడర్లు తన బాధను ప్రజలకు వివరించాలని  కోరారు.