ఇద్దరు పిల్లలు పుట్టాక 22 ఏళ్ల వివాహిత ప్రాణం తీసిన పెళ్లి.. సంగారెడ్డి జిల్లా భీంరాలో ఘటన

ఇద్దరు పిల్లలు పుట్టాక 22 ఏళ్ల వివాహిత ప్రాణం తీసిన పెళ్లి.. సంగారెడ్డి జిల్లా భీంరాలో ఘటన

కంగ్టి, వెలుగు: అదనపు కట్నం వేధింపులకు మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపిన ప్రకారం.. కంగ్టి మండలం నాగన్ పల్లి గ్రామానికి చెందిన పోగుల సుజాత, రవీందర్ రెడ్డి దంపతులు తమ రెండో కూతురు మహేశ్వరి(22)ని అదే మండలంలోని భీంరా గ్రామానికి చెందిన పండరిరెడ్డికి ఇచ్చి మూడేండ్ల కింద పెండ్లి చేశారు. దంపతులకు ఇద్దరు కొడుకులు.

కాగా.. కొంతకాలంగా ఆమె మామ గంగారెడ్డి, బావ బసిరెడ్డి అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు పాల్పడుతుండగా భరించలేక సోమవారం ఉదయం ఉరేసుకుని చనిపోయింది. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  మృతురాలి తల్లి సుజాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వెంకట్ రెడ్డి తెలిపారు. అయితే మహేశ్వరి మృతిపై హత్యనా..? ఆత్మహత్యనా ?  అంటూ కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ విజయ్ కుమార్ ను వివరణ కోరగా పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.