
వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని బొమ్మకల్ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆ గ్రామానికి చెందిన గొల్లపల్లి సంధ్యరాణి అనే యువతికి ఆమె తల్లిదండ్రులు.. 5 నెలల కిందట వివాహం చేశారు. అదే జిల్లాలోని హుజురాబాద్ మండలం పెద్దపాపయ్య పల్లి గ్రామానికి చెందిన చల్లూరి సురేశ్ తో ఆమె పెళ్లి జరిపించారు.
పెళ్లి సమయంలో సంధ్యారాణి కుటుంబ సభ్యులు లాంఛనాల క్రింద వరుడికి రూ. 4.5లక్షల నగదు.. బండి కోసం మరో రూ. 80వేలు ఇచ్చారు. ఆ డబ్బు సరిపోదంటూ.. పుట్టింటి నుంచి మరో లక్ష రూపాయలు తేవాలంటూ సంధ్యారాణిని గత కొన్ని రోజులుగా అత్తింటి వారు వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వేధింపులు భరించలేక ఆ యువతి శనివారం నాడు తన తల్లి గారింట్లో ఆత్మహత్యకు పాల్పడింది.