టర్కీలో ఘోరం: హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి

టర్కీలో ఘోరం: హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి

టర్కీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..నార్త్ వెస్ట్ టర్కీలోని స్కై రిసార్ట్ హోటల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది మరణించగా 51మంది గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మంగళవారం ( జనవరి 21, 2025 ) జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా.. 17 మంది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. స్కై రిసార్ట్ లోని 12 అంతస్తుల హోటల్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.హోటళ్లు రద్దీగా ఉన్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించటంతో భారీగా ప్రాణనష్టం జరిగింది.

#LIVE| At Least 66 Killed In Turkey Ski Resort Fire, Tourists Jump From Windows In Panic, Watch Live Visuals Here 🔥
A fire at a 12-story hotel in a Turkish ski resort killed at least 66 people and injured at least 51 others, according to Turkey’s Interior Minister. The fire… pic.twitter.com/X7F1cQmn7F

— Dhram Goswami (@dhram_goswami) January 21, 2025

ప్రమాదం జరిగిన సమయంలో హోటల్ రెస్టారెంట్ సెక్షన్‌లో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై టర్కీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.