హమాస్ కమాండర్ను హతమార్చాం: ఇజ్రాయెల్ సైన్యం

ఉత్తర గాజాలోని జబాలియా శరణార్థి శిబిరంపై మంగళవారం (అక్టోబర్31)న జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడిలో డజన్ల కొద్ద పాలస్తీనీన్లు మృతిచెందారు. ఈ పేలుడులో కనీసం 50 మంది మరణించి ఉండొచ్చన హమాస్ ఆరోగ్య శాఖ తెలిపింది. 

అక్టోబర్ 7న జరిగిన ఉగ్రదాడికి కారణమైన వారిలో ఒకరైన సీనియర్ హమాస్ కమాండర్ ఇబ్రహీం బియారీని ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడిలో హతమార్చిందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే ఈ సీఎన్ బీసీ ధృవీకరించలేదు. 

మరోవైపు గాజాపై దాడులను ఆపే ప్రసక్తే లేదని.. హమాస్ తీవ్రవాదుల అంతమొందించేవరకు గాజాపై దాడులు ఆపమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. అలా చేస్తే హమాస్ తీవ్రవాదులకు లొంగిపోవడంతో సమానం అని అన్నారు. గాజాలో అత్యధిక మరణాలకు హమాస్ కారణమని, పౌరులను తమ కార్యకలాపాలకు అడ్డు పెట్టుకుంటున్నారని నెతన్యాహు ఆరోపించారు. 

ALSO READ :- ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. Whats app లో ఒకేసారి 31 మంది గ్రూప్ కాల్ చేయొచ్చు