తిమ్మాపూర్, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేని ఓ డీఫార్మసీ స్టూడెంట్కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ జీపీ పరిధిలోని సుభాశ్‌నగర్ లోని ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మాస శివప్రియ(21) స్థానికంగా ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీలో డీఫార్మసీ సెకండియర్ చదువుతోంది.
శివప్రియకు చదువుపై ఆసక్తి లేకపోయినా తల్లి ఒత్తిడితో డీ ఫార్మసీలో చేరింది. స్థానిక లక్ష్మిత హాస్టల్‌లో ఉంటోంది. ఇష్టం లేని చదువు చదవలేక మానసిక వేదనకు గురైంది. గురువారం రాత్రి తన తల్లికి ఫోన్ చేసి పరీక్షలు జరుగుతున్నాయని, తనకు భయం వేస్తోందని చెప్పింది. ఏమీ కాదని తల్లి నచ్చజెప్పింది. అయితే, శుక్రవారం ఉదయం హాస్టల్బిల్డింగ్పై నుంచి దూకగా తీవ్రంగా గాయపడింది.
స్థానికులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చేరాలు తెలిపారు.