స్టార్టప్‌‌లు, ఇన్వెస్టర్లను కలపనున్న భాస్కర్‌‌‌‌

స్టార్టప్‌‌లు, ఇన్వెస్టర్లను కలపనున్న భాస్కర్‌‌‌‌

న్యూఢిల్లీ: స్టార్టప్‌‌లు, ఇన్వెస్టర్లు, సర్వీస్‌‌ ప్రొవైడర్లు, ప్రభుత్వ సంస్థలు ఒకేచోట కలవడానికి, ఐడియాలు పంచుకోవడానికి, భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి డిజిటల్ వేదిక భారత్‌‌ స్టార్టప్‌‌ నాలెడ్జ్‌‌ యాక్సెస్ రిజిస్ట్రీని (భాస్కర్‌‌‌‌ను) కామర్స్ మినిస్టర్ పీయూష్‌‌  గోయెల్‌‌ సోమవారం  లాంచ్ చేయనున్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌ను మరింత సమర్ధవంతంగా మార్చేందుకు ఈ సెంట్రల్ హబ్‌‌ను డెవలప్ చేశారు.

 నెట్‌‌వర్కింగ్‌‌, కొలాబరేషన్‌‌ వంటి కొన్ని కీలకమైన ఫీచర్లను కూడా భాస్కర్ అందిస్తోంది. స్టార్టప్‌‌లు ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారా ఇన్వెస్టర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చు. ప్రభుత్వ సంస్థల నుంచి పర్మిషన్లు పొందొచ్చు. ‘ఇన్వెస్టర్లు, స్టార్టప్‌‌లు, మెంటార్ల మధ్య గ్యాప్‌‌ను భాస్కర్ తగ్గిస్తుంది. అన్ని సెక్టార్ల మధ్య కమ్యూనికేషన్‌‌ మెరుగువుతుంది’ అని ప్రభుత్వ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. ప్రతీ స్టేక్‌‌హోల్డర్‌‌‌‌కు ఒక  భాస్కర్‌‌‌‌ ఐడీని ఇష్యూ చేస్తారు.