జయశంకర్​ భూపాలపల్లికి డీపీఆర్​ఓ శ్రీనివాస్​ ట్రాన్స్​ఫర్​

  •      జడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రసూన రాణి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డీపీఆర్​ఓ ఎస్. శ్రీనివాస్​ జయశంకర్​ భూపాలపల్లికి ట్రాన్స్​ఫర్​అయ్యారు. ఈ మేరకు సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్​ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీఆర్​ఓగా ఉన్న అజ్గర్​ హుస్సేన్​ ను ఇన్​చార్జి డీపీఆర్​ఓగా కలెక్టర్​ ప్రియాంక అల నియమించారు. 

జడ్పీ సీఈఓగా ప్రసూన రాణి..

జడ్పీ సీఈఓగా ఎస్.ప్రసూన రాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. మర్యాద పూర్వకంగా ఆమె కలెక్టర్​ను కలిశారు. కొత్తగూడెం మున్సిపల్​ కమిషనర్​గా బాధ్యతలు చేపట్టిన శేషు కూడా కలెక్టర్​ను కలిశారు.