మార్చిలోపు 3 మెట్రో కారిడార్ల డీపీఆర్ : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

మార్చిలోపు 3 మెట్రో కారిడార్ల డీపీఆర్ : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
  • హైదరాబాద్​నుహరిత నగరంగా చేస్తం 
  • ఐజీబీసీ గ్రీన్ క్రూసేడర్లకురిజిస్ట్రేషన్ పేపర్లు అందజేత

హైదరాబాద్ సిటీ, వెలుగు: మార్చి నాటికి శంషాబాద్ ఎయిర్ పోర్టు– ఫోర్త్ సిటీ, జేబీఎస్ – మేడ్చల్, జేబీఎస్– శామీర్​పేట్ మెట్రో కారిడార్లకు డీపీఆర్​లను సిద్ధం చేయనున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్  తెలంగాణ సమ్మిట్–2025 శనివారం హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరిగిన గ్రీన్ క్రూసేడర్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైదరాబాద్ నాలుగువైపులా మెట్రో రైల్ నడవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముమ్మరంగా పనులు కొనసాగిస్తున్నామని కొత్త మెట్రో కారిడార్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. 

సిటీని హరిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఐజీబీసీల్లో గ్రీన్ క్రూసేడర్స్ గా రిజిస్టర్ చేసుకున్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలకు ఎన్వీఎస్ రెడ్డి రిజిస్ట్రేషన్ పేపర్లు అందజేశారు. అనంతరం డెవలపర్లు, బిల్డర్లు, కార్పొరేట్లు, వివిధ ప్రాజెక్ట్ ల యజమానులు ప్రాజెక్టులను ఐజీబీసీ సిస్టమ్‌‌ల కింద నమోదు చేసుకొని గ్రీన్ హైదరాబాద్ దిశగా భాగస్వామ్యం అవుతున్నట్టు ప్రకటించాయి. కార్యక్రమంలోఐజీబీసీ నేషనల్ వైస్ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి, హైదరాబాద్ చైర్మన్ జి.శ్రీనివాస మూర్తి, క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ వి.రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.