అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పెంపు

అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో డిగ్రీ/పీ.జీ కోర్సులో చేరడానికి చివరి తేదిని అక్టోబర్ 30 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ ఇంఛార్జ్ రిజిస్ట్రార్ ఇ సుధారాణి ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వర్శిటీలో 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరి ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అంతకు ముందు చేరి సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు అక్టోబర్ 30వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును చెల్లించాలని ఇంఛార్జ్ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. ఆన్ లైన్‌లో నమోదు, తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాలని లేదా విశ్వవిద్యాలయ టోల్‌ఫ్రీ నంబర్ 18005990101, హెల్ప్‌డెస్క్ నంబర్లు 7382929570/580, 040-23680222/333/555లను సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www.braouonline.in లేదా  www.braou.ac.in విజిట్ చేయాలని వివరించారు.

ALSO READ | గ్రూప్​ 1 అభ్యర్థులకు గుడ్​ న్యూస్​ : ఈ నెల 21 నుంచి మెయిన్స్​