ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 128వ జయంతిని అసెంబ్లీ ప్రాంగంణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క, మండలి డిప్యూటి ఛైర్మన్ నేతి విద్యా సాగర్ అసెంబ్లీ ప్రాంగణంలోని అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్ 128వ జయంతిని పురస్కరించుకుని హన్మకొండలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీ హరి, ఎంపీ బండ ప్రకాశ్. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించడం బాధకరమన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హక్కులు కాపాడుకోవడంలో  దళితులంతా రాజకీయాలు, పార్టీలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.