చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి డా.బీఆర్​ అంబేద్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి డా.బీఆర్​ అంబేద్కర్  జయంతి పోస్టర్ ఆవిష్కరణ

హైటెక్​ సిటీలోని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి నివాసంలో ఇంద్రవెల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు ఆయనను కలిశారు.  ఆ తరువాత ఆయన వారితో కలిసి అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను  ఆవిష్కరించారు.  ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి లోజరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు రావాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని ఆహ్వానించారు.