బ్రహ్మానందాన్ని కలిసిన లీఫ్ ఆర్టిస్ట్

నారాయణ్ ఖేడ్, వెలుగు: ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందాన్ని గురువారం ఖేడ్ లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. రావి ఆకుపై గీసిన బ్రహ్మానందం ఫొటోను బహూకరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం.. శివకుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అతడి వెంట వడ్ల పవన్, నవీన్, బాలు, దుర్గ ప్రసాద్ ఉన్నారు.