30న ‌‌‌‌బీజేపీలోకి వికాస్‌‌రావు?

వేములవాడ, వెలుగు: మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు ఈనెల 30న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సుమారు 500 మంది కార్యకర్తలతో పార్టీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఇప్పటికే గ్రామగ్రామాన వాల్ పోస్టర్లు వేస్తూ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు.  వికాస్​మూడేండ్లుగా నియోజకవర్గంలో ప్రతిమ ఫౌండేషన్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.