లోకేశ్వరం మండలానికి అంబులెన్స్​ వితరణ

  • నిర్మల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్​రెడ్డి ఉదారత

లోకేశ్వరం, వెలుగు: కిష్టాపూర్ గ్రామానికి చెందిన నిర్మల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవేందర్ రెడ్డి ఆయన సొంత నిధులతో లోకేశ్వరం మండలానికి అంబులెన్స్​ను విరాళంగా ఇచ్చారు.  ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్​శ్యాంసుందర్ మాట్లాడుతూ..  డాక్టర్ దేవేందర్ రెడ్డి మండలానికి వివిధ రకాల సేవలు చేస్తున్నారని కొనియాడారు.  ఇటీవలే కిష్టాపూర్ గ్రామానికి వైకుంఠ రథాన్ని విరాళంగా ఇచ్చారన్నారు. నిర్మల్ లో కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించి అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు.

మండల వాసులు ఇలాగే ప్రోత్సహిస్తే మరింత సేవ చేస్తానని డాక్టర్ దేవేందర్ రెడ్డి అన్నారు.  అంబులెన్స్ వినియోగించే రోగులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని సూచించారు. ఎంపీపీ లలిత, ఎస్ ఐ సాయి కుమార్, నాయకులు నగరం నారాయణరెడ్డి, భుజంగరావు,  చిన్నారావు, శ్యాంసుందర్ కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.