హైదరాబాద్,వెలుగు:అత్యాధునిక టెక్నాలజీల ద్వారా తాము దంత వైద్యం చేస్తున్నామని డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ తెలిపింది. హైదరాబాద్‌లోని పుప్పాల గూడలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాస్పిటల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గౌడ్స్ డెంటల్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ స్నిగ్ధ మాట్లాడు తూ 1984లో కాస్మెటిక్ డెంటిస్ట్రీని ప్రవేశపెట్టామని, 1990లో డెంటల్ లేజర్లు, 1998లో ఇంప్లాంట్లు, 2015లో క్లియర్అలైనర్లు తీసుకొచ్చామని చెప్పారు.
ఏఐ, ఐటెరో ఎలిమెంట్ 5డీ ప్లస్ స్కానర్‌లు, ట్రియోస్ 5 స్కానర్‌లు, 3డీ ప్రింటర్లు, సీఏడీ-సీఏఎం ఆధారిత ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి కచ్చితమైన రోగ నిర్ధారణ చేస్తున్నామని చెప్పారు.