![క్వాలిటీ కేర్ గ్రూప్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా హరి ప్రసాద్](https://static.v6velugu.com/uploads/2024/04/dr-hari-prasad-takes-over-as-quality-care-group-chairman_P1xXWF4QkN.jpg)
హైదరాబాద్, వెలుగు: సెంట్రలైజ్డ్హెల్త్కేర్ ప్రొవైడర్ క్వాలిటీ కేర్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా డాక్టర్ హరి ప్రసాద్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వరుణ్ ఖన్నా నియమితులయ్యారు. ఈ రంగంలో డాక్టర్ హరి ప్రసాద్ కు 30 సంవత్సరాల అనుభవం ఉంది.
ఇటీవలి వరకు ఆయన అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా పని చేస్తున్నారు. రాయల్ కాలేజ్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, యూకే, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆయనను ఫెలోషిప్‌తో సత్కరించింది.