మెట్ పల్లి, వెలుగు: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెట్‌పల్లికి చెందిన డాక్టర్ జేఏన్ వెంకట్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా కోరుట్ల నియోజకవర్గ పార్టీలో జరుగుతున్న పరిణామాలు తమను తీవ్రంగా బాధించాయన్నారు.
రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు. కాగా వెంకట్ త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం.