హైదరాబాద్, వెలుగు: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అధ్యక్షుడిగా డాక్టర్ జానారెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 23 నుంచి 25 వరకూ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు.
స్టేట్ సెక్రటరీగా రాంబాబు, వైస్ ప్రెసిడెంట్లుగా కరుణాకర్ రెడ్డి (గద్వాల), పి.శ్యామ్ (వరంగల్), వినోద్ (నిర్మల్), జాయింట్ సెక్రటరీలుగా రాకేశ్ (కరీంనగర్), కళ్యాణి (హైదరాబాద్), శ్రీరామ్ (ఇబ్రహీంపట్నం), నరేశ్ తేజ( మహబూబ్ నగర్), రాజు (ఓయూ), చత్రపతి చౌహాన్( ఎంజీయూ) ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. భారతీయతతో కూడిన విద్యావిధానం ఎన్ఈపీ– 2020 రూపకల్పనకు ఏబీవీపీ కృషి చేసిందన్నారు. రాష్ట్ర విద్యారంగంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.