రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కె.లక్ష్మణ్  

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కె.లక్ష్మణ్  

లక్నో: బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవాళ మధ్యాహ్నంతో రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి నామినేషన్లు ఉపసంహరణ ముగిసింది. లక్ష్మణ్ తప్ప బరిలో వేరే ఎవరూ లేకపోవడంతో... లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రిట‌ర్నింగ్ అధికారి నుంచి ల‌క్ష్మ‌ణ్ డిక్ల‌రేష‌న్ అందుకున్నారు. ఇదే విషయాన్ని లక్ష్మణ్ తన ట్విట్టర్ లో పంచుకున్నారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనట్లు లక్ష్మణ్ తన ట్విట్టర్ లో తెలిపారు. యూపీ కోటా నుంచి బీజేపీ ఆయ‌న‌ను రాజ్య‌స‌భ బ‌రిలో నిలిపిన విషయం తెలిసిందే. రాజ్య సభ సభ్యుడిగా తనకు అవకాశం ఇచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌కు ల‌క్ష్మ‌ణ్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 

మరిన్ని వార్తల కోసం...

ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ