జనాభా దామాషా ప్రకారం వైశ్యులకు రాజకీయ వాటా దక్కాలి : కాచం సత్యనారాయణ గుప్తా

జనాభా దామాషా ప్రకారం వైశ్యులకు రాజకీయ వాటా దక్కాలి : కాచం సత్యనారాయణ గుప్తా

ఖైరతాబాద్, వెలుగు: జనాభా దామాషా ప్రకారం వైశ్యులకు రాజకీయ వాటా దక్కాల్సిందేనని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్​ కాచం సత్యనారాయణ గుప్తా ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ‘జనాభా దామాషా ప్రకారం వైశ్యుల రాజకీయ ప్రాతినిధ్యం’ అనే అంశంపై ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్​ టేబుల్​ సమావేశం జరిగింది. సత్యనారాయణ మాట్లాడుతూ వైశ్యులకు కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. 

ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్​ ఏర్పాటు చేసినా నిధులు ఇవ్వలేదని, కనీసం రూ.వెయ్యి కోట్లు విడుదల చేయాలన్నారు. ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లలో కూడా జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేయాలన్నారు.  వైశ్యుల సమస్యలపై ఏప్రిల్ ​నెలలో వైశ్య రణభేరి పేరుతో  120  కిలోమీటర్లు పాదయాత్ర చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో పాల్గొన్న పల్లె రవికుమార్​, విమలక్క మాట్లాడుతూ వైశ్యుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. తులసి , రవి పాల్గొన్నారు.