కాశీబుగ్గ/నర్సింహులపేట, వెలుగు : వరంగల్‌కు చెందిన డాక్టర్ కాళీప్రసాద్‌రావు బీజేపీలో చేరారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన మీటింగ్‌లో అమిత్‌షా చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కాళీప్రసాద్‌రావు మాట్లాడుతూ సుమారు ఐదు వేల మందితో కలిసి బీజేపీలో చేరినట్లు తెలిపారు. అనంతరం బండి సంజయ్, దేవేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన బీఆర్‌ఎస్ జడ్పీటీసీ భుక్యా సంగీత బీజేపీలో చేరారు.
ఖమ్మం సభకు తరలిన బీజేపీ లీడర్లు
మహబూబాబాద్ అర్బన్/తొర్రూరు, వెలుగు : ఖమ్మంలో ఆదివారం జరిగిన ‘రైతు గోస బీజేపీ భరోసా’ సభకు మహబూబాబాద్ జిల్లా నుంచి నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మహబూబాబాద్ నియోజవర్గం నుంచి బయలుదేరిన బస్సులను మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జాటోతు హుస్సేన్ ప్రారంభించారు. తొర్రూరు నుంచి బయలుదేరిన వాహనాలను రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెదగాని సోమయ్య, లేగా రాంమోహన్‌రెడ్డి, చందుపట్ల సత్యపాల్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు శశివర్ధన్‌రెడ్డి,రాంచంద్రరావు, సీతయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, సిద్ధార్థరెడ్డి, సతీశ్, పల్లె సందీప్, తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్, పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్, జిల్లా కార్యదర్శి రచ్చ కుమార్, నాయకులు కొలుపుల శంకర్, అలిసేరి రవిబాబు పాల్గొన్నారు.