చెరువుల రక్షణకు‘నిడ్రా’ అవసరం

చెరువుల రక్షణకు‘నిడ్రా’ అవసరం
  • మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్​ కేశవులు

నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పార్కు భూములు కాపాడడానికి హైడ్రా తరహాలో 'నిడ్రా' ఏర్పాటు చేయాలని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్​ డాక్టర్​ కేశవులు కోరారు. బుధవారం పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్​ టేబుల్​ మీటింగ్​నిర్వహించి మాట్లాడారు. నగర శివారులోని రామర్తి చెరువు విస్తీర్ణం 30 ఎకరాలు కాగా 15 ఎకరాలకు మించి ఆక్రమణకు గురైందన్నారు. భీంగల్​లోని రాతం చెరువు శిఖం పదెకరాలను ఇప్పటికే కబ్జాకు చేశారని, మొగిలి చెరువు, ధర్మారాయుడి కుంటను ఆక్రమించారని ఆరోపించారు.

ఆర్మూర్​, బోధన్​, డిచ్​పల్లి చెరువు శిఖాలు, నిజాంసాగర్​ కెనాల్స్ అన్యాక్రాంతమైనట్లు ఆఫీసర్లకు పలువురు ఫిర్యాదు చేశారని తెలిపారు. అయితే,  రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ ఆఫీసర్లు వీటిపై స్పందించడంలేదని వాపోయారు. సమాజ సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వ భూములను రక్షించడానికి నిడ్రా ఏర్పాటు చేయడం మినహా మరో మార్గంలేదన్నారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్​ ప్రెసిడెంట్​ గద్దె భూమన్న, సీపీఎం జిల్లా సెక్రటరీ రమేశ్, పెద్ది వెంకట్రాములు, బీఆర్​ఎస్​ మాజీ ఫ్లోర్​ లీడర్​ మురళీ, బీఎల్ఎఫ్​స్టేట్​ప్రెసిడెంట్​ దండి వెంకట్, రిటైర్డ్​ ఎంప్లాయిస్​ యూనియన్​ జిల్లా నాయకుడు రామ్మోహనరావు, పద్మశాలి నగర అధ్యక్షుడు దాబా నర్సయ్య, జనసేన నేత సంతోష్​, ప్రజాసంఘాల నేతలు తూటికూర నర్సయ్య, శ్రీనివాస్​, అశోక్​గౌడ్​, రమేష్​ నాయక్​, హర్షవర్థన్​రెడ్డి, రుషికుమార్, వనజ, విజయ జర్నలిస్టు నేతలు బొబ్బిలి నర్సయ్య, గంగాదాస్​, నర్సయ్య ఉన్నారు.