భైంసా, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ దుకాణం క్లోజ్ అయినట్టేనని కాంగ్రెస్ నేత డా.కిరణ్ కొమ్రేవార్ అన్నారు. ఆదివారం భైంసాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోని నామమాత్రంగా అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈసారి కూడా ఆ పార్టీ అమాయక ప్రజలకు తప్పుడు హామీలిస్తోందని ఫైర్ అయ్యారు.
ఎన్నికల వేళ కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారన్నారు. ఉచిత హామీలు ప్రజలకు అవసరం లేదని.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, పేద ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వ్యవస్థలను మెరుగుపర్చితే చాలన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఖచ్చితంగా తమ పార్టీ ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. లీడర్లు దేవీదాస్, మహేశ్, కిరణ్తదితరులున్నారు.