సోయా రైతులను ఆదుకోవాలి: డా.కిరణ్ కుమార్

కుభీర్, వెలుగు: వైరస్​ సోకి తీవ్రంగా నష్టపోయిన సోయా రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కాంగ్రెస్​ నేత డా.కిరణ్ కుమార్​డిమాండ్​ చేశారు. బుధవారం నిర్మల్​జిల్లా కుభీర్ మండలం సిర్పెల్లి, పల్సి, కుభీర్ ​తదితర గ్రామాల్లో దెబ్బతిన్న సోయా పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముథోల్​నియోజకవర్గంలో పేద రైతు కుటుంబాలు ఉన్నాయని, అప్పులు చేసి పంటలను సాగు చేస్తున్నారని తెలిపారు. 

మరికొద్ది రోజుల్లో పంట దిగుబడి వస్తుందనుకుంటే వేలాది ఎకరాల్లో సోయా పంటలకు కొత్త వైరస్​ సోకిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో రైతు ఎకరానికి రూ.20 వేల వరకు నష్టపోయారని, ప్రభుత్వం వెంటనే సర్వే చేసి పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. రైతుల పక్షాన కాంగ్రెస్​ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట నిగ్వ ఎంపీటీసీ దేవిదాస్, రైతులు ఉన్నారు.