ఐకార్ సైంటిస్ట్ కృష్ణమూర్తికి విజ్ఞాన్ యువ అవార్డు

న్యూఢిల్లీ, వెలుగు: ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్(ఐకార్)లో సీనియర్ సైంటిస్ట్​గా పనిచేస్తున్న డాక్టర్ కృష్ణమూర్తి ప్రతిష్టాత్మకమైన రాష్ట్రీయ విజ్ఞాన్ యువ- శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం దక్కింది. గురువారం రాష్ట్రపతి భవన్ జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డు అందుకున్నారు. 

రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాల కింద విజ్ఞాన్ రత్న, విజ్ఞాన్ శ్రీ, విజ్ఞాన్ యువ, విజ్ఞాన్ టీమ్ అనే నాలుగు విభాగాలలో 33 అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. కృష్ణమూర్తి.. ఉప్పును తట్టుకునే ఆరు వరి వంగడాలను, నాలుగు జన్యు రకాలను అభివృద్ధి చేశారు. అలాగే బెంగుళూరులోని ఐఐఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అర్వింద్ పెన్మత్స కూడా విజ్ఞాన్ యువ పురస్కారాన్ని స్వీకరించారు.