మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా డాక్టర్‌‌‌‌‌‌‌‌ లాలయ్య

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా డాక్టర్‌‌‌‌‌‌‌‌ లాలయ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్‌‌‌‌ఎంసీ) రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా రిటైర్డ్‌‌‌‌ ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఆఫీసర్ డాక్టర్ లాలయ్య నియమితులయ్యారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌‌‌‌ చదివిన లాలయ్య.. ముంబైలోని ఓఎన్‌‌‌‌జీసీలో మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా పని చేశారు. ఆ తర్వాత బాబా అటామిక్‌‌‌‌ రీసెర్చ్ సెంటర్‌‌‌‌‌‌‌‌లో సైంటిస్ట్‌‌‌‌గా జాయిన్ అయ్యారు.

అనంతరం ఐఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు ఎంపికై, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పని చేశారు. లాలయ్య ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ కూడా పూర్తి చేశారు. ఆయనకు ఉన్న అర్హతల నేపథ్యంలో ఆయన్ను రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌గా నియమించినట్టు కౌన్సిల్ చైర్మన్‌‌‌‌ డాక్టర్ మహేశ్‌‌‌‌ తెలిపారు. ఈ మేరకు గురువారం లాలయ్యకు ఆయన నియామకపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిల్ వైస్ చైర్మన్‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.