కమ్యూనికేషన్​ స్కిల్స్​చాలా ముఖ్యం :  డాక్టర్ లలిత ఆనంద్

కమ్యూనికేషన్​ స్కిల్స్​చాలా ముఖ్యం :  డాక్టర్ లలిత ఆనంద్
  • సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ లో డాక్టర్ లలిత ఆనంద్

ముషీరాబాద్, వెలుగు: ప్రతి విద్యార్థి ఉన్నతంగా రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని డాక్టర్ లలిత ఆనంద్ చెప్పారు. చాలా మంది ర్యాంకుల కుస్తీలో పడి సమాజంలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారన్నారు. ఇతరులతో అన్ని విషయాలను షేర్ చేసుకోవాలని, అప్పుడే అన్నింటిపై అవగాహన వస్తుందన్నారు. బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ లా కాలేజీలో శుక్రవారం ఎంబీఏ, లా విద్యార్థులకు సెల్ఫ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ నిర్వహించారు.

కళాశాలల కరస్పాండెంట్ సరోజ వివేక్​తో కలిసి డాక్టర్ లలిత ఆనంద్ హాజరై మాట్లాడారు. స్టూడెంట్లు చదువుకు అధిక ప్రయారిటీ ఇచ్చి మనోధైర్యం కోల్పోతున్నారని, ట్రబుల్స్ వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలియక మధ్యలోనే ఆగిపోతున్నారని ఆందోలన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ తోపాటు మాతృభాషకు ప్రాధన్యం ఇవ్వాలని సూచించారు. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవద్దని కరస్పాండెంట్​సరోజా వివేక్ చెప్పారు.

చదువుతోనే అభివృద్ధి అనే ఆకాంక్షతో విద్యాసంస్థలు నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.