చదువుతో పాటు స్టూడెంట్స్​కు క్రీడలు అవసరం

ఆర్మూర్, వెలుగు: - చదువుతో పాటు స్టూడెంట్స్ కు క్రీడలు అవసరమని  ఇనిస్టిట్యూట్​ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫూర  చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ అన్నారు. ఆదివారం ఆర్మూర్ లో 42వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుందని, మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించి అట్టహాసంగా క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాల నుంచి బాలుర జట్లు 09, 08 బాలికల జట్లు రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మానస గణేశ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్పోర్ట్స్​ ఆఫీసర్​ ముత్తన్న, జిల్లా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి. విద్యాసాగర్ రెడ్డి, బాల్ బ్యాట్మెంటన్ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారావుపాల్గొన్నారు.