
గజ్వేల్, వెలుగు: ఆయిల్ పామ్‌సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆయిల్సీడ్స్రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి అన్నారు. బుధవారం ఆయన ఆధ్వర్యంలోని కేంద్ర, రాష్ట్ర అధికారులు గజ్వేల్, కుకునూర్ పల్లి మండలాల్లోని బూర్గపల్లి, అక్కారం, గురువన్నపేటల్లో సాగు చేసిన తోటలను సందర్శించారు.
జిల్లాలో ఇప్పటివరకు 2,339 ఎకరాల్లో ఈ తోటలు సాగవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ అధికారులు భాస్కర్‌రెడ్డి, శంకర్, ప్రవీణ్ రెడ్డి, అడిషనల్ డైరెక్టర్ హార్టికల్చర్ సరోజినిదేవి, జిల్లా ఉద్యానశాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.