నార్మల్ డెలివరీలపై అవగాహన కల్పించాలి : ప్రమోద్ కుమార్

  • జగిత్యాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ 

మెట్ పల్లి, వెలుగు: నార్మల్ డెలివరీ లతో కలిగే లాభాలపై గర్భిణీలకు అవగాహన కల్పించి గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనే డెలివరీ లు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు.  బుధవారం మెట్ పల్లి మండలం జగ్గసాగర్ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, వెల్లుల్ల, ఆత్మకూర్ సబ్ సెంటర్లను డీఏంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను పరిశీలించారు. గర్భిణి స్త్రీలతో  మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. 

 ఓపీ, మందుల స్టోర్ రూం పరిశీలించి స్టాక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.  రికార్డులను పరిశీలించారు.  ల్యాబ్ ను పరిశీలించి టీ హబ్ కు పంపిస్తున్న శాంపిల్స్ పరిశీలించారు.  టీబీ వ్యాధి సంబంధిత కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల ప్రగతిని సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ అంజిత్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.