ప్రీతి సూసైడ్ అటెంప్ట్ చేసిన గది ఓపెన్.. ఎంజీఎం అధికారులకు తాళాలు

వరంగల్​సిటీ, వెలుగు: కాకతీయ మెడికల్  కాలేజీ పీజీ స్టూడెంట్​ డాక్టర్​ ప్రీతి ఆత్మహత్యా యత్నం చేసిన గదిని పోలీసులు మంగళవారం రాత్రి తెరిచారు. ఫిబ్రవరి 22న ప్రీతి ఎంజీఎంలోని ఎమర్జెన్సీ ఆపరేషన్​ థియేటర్​ పక్కనే ఉన్న డాక్టర్స్​ రెస్ట్​ రూంకు వెళ్లి అనుమానాస్పద స్థితిలో ఆమె చనిపోయిన విషయం తెలిసిందే.

ఆనాటి నుంచి ఈ గదిని  పోలీసులు సీజ్​ చేశారు. 56 రోజుల తర్వాత మట్టేవాడ పోలీసులు ఆ గదిని తెరిచి ఎంజీఎం అధికారులకు తాళాలు అప్పగించారు.  ప్రీతి మృతిపై ఎలాంటి పురోగతి తేలకుండానే ఈ గదిని ఓపెన్​ చేయడంతో కేసు ముగిసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

స్టూడెంట్లు సెల్​ఫోన్​ వాడకుండా చూడాలి

కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్​దాస్ అధ్యక్షతన మంగళవారం డాక్టర్ల సమావేశం నిర్వహించారు. తరగతి గదులకు కొందరు స్టూడెంట్స్​ సెల్​ఫోన్​లు తీసుకొచ్చి ఫొటోలు తీయడం, రీల్స్​ చేస్తున్నారు. దీంతో క్లాస్​రూమ్స్ డిస్టర్బ్  అవుతున్నాయని కొంతమంది విద్యార్థులు పేర్కొంటున్నారు. స్టూడెంట్లు క్లాస్ రూంలకు మొబైల్  ఫోన్లు తేకుండా చూడాలని ప్రిన్సిపాల్ వైద్యులకు సూచించారు.