
హైదరాబాద్/వరంగల్‌సిటీ, వెలుగు : వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీగా డాక్టర్ పీవీ.నందకుమార్‌రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన బుధవారం సాయంత్రం చార్జ్ తీసుకున్నారు. ఈయన మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. నారాయణపేట జిల్లాకు చెందిన నందకుమార్ 12వ తరగతి వరకు స్థానికంగానే చదువుకొని హైదరాబాద్ గాంధీలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో ఎంఎస్ పూర్తి చేశారు.
తర్వాత సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేసి పదవీవిరమణ పొందారు. చార్జ్ తీసుకున్న వీసీకి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్, అడ్మిషన్ కమిటీ మెంబర్ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ హేమంత్‌కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖలీర్ ఇతర సిబ్బంది శుభాకాంక్షలు చెప్పారు.